తగిన చర్యలు తీసుకోండి…
ఈ సందర్భంగా ఆగమశాస్త్ర నిబుధనలు, ఆలయ పవిత్రత, భద్రత, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని నో ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు. తిరుమల కొండపై తక్కువ ఎత్తులో ఎగిరే విమానాలు, హెలికాప్టర్లు, ఇతర వైమానిక కార్యాకలాపాలతో శ్రీవారి ఆలయం చుట్టూ ఉన్న పవిత్రమైన వాతావరణానికి భంగం కలుగుతోందని తెలియజేశారు.