పూరి జగన్నాథ్ పేరుకి పరిచయం అక్కర్లేదు. ఇక తన కొడుకు ఆకాష్ పూరీని చైల్డ్ ఆర్టిస్టుగా లాంచ్ చేశాడు. ఆకాష్‌కు మంచి హిట్లు కూడా వచ్చాయి. బుజ్జిగాడు , ఏక్ నిరంజన్, ది లోటస్ పాండ్, బిజినెస్ మ్యాన్, ధోని, గబ్బర్ సింగ్, ఆంధ్రాపోరి, చోర్ బజార్ వంటి తెలుగు చిత్రాలలో నటించి అదరగొట్టాడు. అలాంటి ఆకాష్ ఇప్పుడు తల్వార్ అనే మూవీతో రాబోతున్నాడు. ఈ మంత్ లో షూటింగ్ స్టార్ట్ కాబోతోంది. అది ఫుల్ యాక్షన్ మూవీగా ఆడియన్స్ ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో ఆకాష్ కొన్ని చిట్ చాట్ ప్రశ్నలకు ఆన్సర్స్ ఇచ్చాడు. “నాకే గనక ఎవరికీ కనిపించకుండా ఉండే సూపర్ పవర్స్ వస్తే అమెరికాలోని వైట్ హౌస్ కి వెళ్తాను. అసలు అక్కడ ఎం జరుగుతుంది, ఆ ప్లానింగ్స్ ఏమిటి అవన్నీ చూడాలని ఉంది. ప్రభాస్ నా ఫేవరేట్ హీరో. చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసేటప్పుడు అంతా ఈజీగానే అనిపిస్తుంది. కానీ హీరో అయ్యాక కానీ అసలు విషయం తెలీదు..చాలా కష్టం అని తెలుస్తుంది. మల్టిస్టారర్ మూవీ చేయాలంటే రాహుల్ విజయ్ తో కలిసి చేస్తాను. నాన్న చేసే మూవీస్ ని రిక్రియేట్ చేయడం కంటే చూసి ఎంజాయ్ చేయడమే ఇష్టం. మా నాన్న డైరెక్ట్ చేసిన మూవీస్ లో పోకిరి, నేనింతే బాగా ఇష్టం. రవితేజ గారంటే ఇష్టం, అలాగే పవన్ కళ్యాణ్ గారు అన్నా ఇష్టమే..ఎందుకంటే ఏమీ లేనప్పుడు మా నాన్నకు ఫస్ట్ మూవీ అవకాశం ఇచ్చింది పవన్ కళ్యాణ్ గారు . ఆయనకు మా ఫామిలీ ఎప్పుడూ రుణపడి ఉంటుంది.” పూరి జగన్నాథ్ తన ఫస్ట్ ఫిలిం బద్రి. ఈ మూవీ అటు పూరికి ఇటు పవన్ కళ్యాణ్ కి ఎంత మంచి పేరు తెచ్చిపెట్టిందో అందరికీ తెలుసు. ఇక ఆ తర్వాత పూరి జగన్నాధ్ వెనక్కి తిరిగి చూసుకోలేదు.