అసిడిటీని నిర్లక్ష్యం చేస్తే ఏమవుతుంది?
అసిడిటీ అనేది సాధారణ జీర్ణ సమస్యే. అయినప్పటికీ ఇది మొదట్లో చిన్నదిగానే అనిపించవచ్చు. కానీ దీర్ఘకాలికంగా చాలా ఇబ్బందులను తెచ్చిపెడుతుంది. సమస్య తీవ్రమైతే కడుపులో నొప్పి, అజీర్తి, మంట, ఛాతి దిగువ భాగంలో నొప్పి, మంట, పుల్లటి తేన్పులు, వికారం వంటి సమస్యలు ఎదురవుతాయి. ఇవి మిమ్మల్ని బాగా చికాకు పెట్టవచ్చు. ముఖ్యంగా రంజాన్ మాసంలో నెల రోజుల పాటు ఉపవాస నియమాలను పాటిస్తారు గనుగ అసిడిటీని ఈజీగా తీసుకోకండి. ఇది మీ ఆరోగ్యాన్ని, ఉపవాసాన్ని పాడు చేయచ్చు. పండుగ సమయానికి మిమ్మల్నీ మరింత బలహీనంగా మర్చవచ్చు.