యాభైకిపైగా సినిమాలు…
రైటర్‌గానే కాకుండా సింగర్‌గా, లిరిసిస్ట్‌గా ప్రతిభను చాటుకున్నాడు సాగర్. తెలుగులో యాభైకిపైగా సినిమాల్లో పాటలు పాడాడు. వర్షం సినిమాలోని నీటిముళ్లై సాంగ్‌తో సాగర్ సింగింగ్ జర్నీ మొదలైంది. నువ్వొస్తానంటే నేనొద్దంటానా, బొమ్మరిల్లు, పౌర్ణమి, రెడీ, జులాయి, ఎఫ్2 తో పాటు పలు సినిమాల్లో తన పాటలతో మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాడు. ఆర్య సినిమాకుగాను గాయకుడిగా నంది అవార్డును అందుకున్నాడు. లైగర్, నేను శైలజ సినిమాలకు లిరిసిస్ట్‌గా పనిచేశాడు.