Kakinada Bad Teacher: కాకినాడ జిల్లాలో ఘోరం, విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు…
ఆంధ్ర ప్రదేశ్ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 03 Mar 202503:22 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Kakinada Bad Teacher: కాకినాడ జిల్లాలో ఘోరం, విద్యార్థినులపై ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులు…
- Kakinada Bad Teacher: కాకినాడ జిల్లాలో ఘోరమైన ఘటన చోటు చేసుకుంది. విద్యార్థినులపై ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు లైంగిక వేధింపులకు దిగాడు. విద్యార్థినులు ఎవరికి చెప్పాలో తెలియక పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పాఠశాలకు వెళ్లి విద్యార్థినులను విచారించారు.
Mon, 03 Mar 202502:42 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Anantapur Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం, ఆటోను ఢీకొన్న కారు, ముగ్గురు అక్కా చెల్లెళ్ల దుర్మరణం
- Anantapur Accident: అనంతపురంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపు తప్పిన కారు ఆటోను డీకొట్టడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ముగ్గురు అక్కా చెల్లెళ్లు ఉన్నారు. అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు-బ్రాహ్మణపల్లి మధ్య అనంతపురం – బళ్లారి రహదారిపై ఈ ఘటన జరిగింది.
Mon, 03 Mar 202501:53 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: ATM Robbery: హైదరాబాాద్ ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లోనే ఏటీఎంలో చోరీ, రూ.30లక్షల నగదు అపహరణ
- ATM Robbery: హైదరాబాద్‌లో శివార్లలోని ఆదిభట్లలో నాలుగు నిమిషాల్లో ఏటీఎం పగుల గొట్టి నగదు చోరీ చేయడం కలకలం రేపింది. దాదాపు రూ.30లక్షల నగదుతో నిందితులు ఉడాయించారు. సీసీ కెమెరాలకు స్పే చేసి, అలారం ఆపేసి దుండగులు చోరీకి పాల్పడ్డారు.
Mon, 03 Mar 202501:07 AM IST
ఆంధ్ర ప్రదేశ్ News Live: Godavari Pushkaralu: ఏపీలో గోదావరి పుష్కరాలకు రూ.1587కోట్లతో వివిధ శాఖల ప్రతిపాదనలు
- Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు ముహుర్తం దగ్గర పడుతుండటంతో ఏర్పాట్లు మొదలయ్యాయి. 2027లో జరిగే గోదావరి పుష్కరాల కోసం వివిధ ప్రభుత్వ శాఖలు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నాయి. రూ.1587కోట్లతో భక్తులకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టనున్నారు.