తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని చూస్తే ఏమనాలో అర్ధం కావడం లేదని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. ఓ పక్క మోడీని మంచోడంటాడు.. మరో పక్క కిషన్ రెడ్డిని చెడ్డోడంటాడని అరవింద్ మండిపడ్డారు. రాష్ట్రంలో జరిగే అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారంటూ చేసిన వ్యాఖ్యలకు గట్టిగా కౌంటర్ ఇచ్చారు. ఎక్కడా కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఒకరికి తక్కువా, మరొకరి ఎక్కువగా ఎప్పుడూ చేయరని అరవింద్ అన్నారు.