తమ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు పెంచలేదని శాసన మండలిలో ఏపీ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ వెల్లడించారు. భవిష్యత్తులోనూ పెంచబోమని ప్రజలకు హామీ ఇచ్చారు. పెరిగిన చార్జీలు అన్నీ, వైసీపీ ప్రభుత్వంలోని వేనని అన్నారు. వైసీపీ ప్రభుత్వం విద్యుత్ కొనుగోలుకి ఏడాదికి రూ.10 వేల కోట్లు ఖర్చు పెడితే, తాము గత 9 నెలల్లో ఆ ఖర్చుని 60% తగ్గించామని గుర్తు చేశారు.