మార్కెట్ విశ్లేషణ
‘‘మార్కెట్లలో హెచ్చు తగ్గులు సహజం. ఉత్తేజభరిత రాబడుల తరువాత, దీర్ఘకాలం స్తబ్దత ఉండవచ్చు. హైపర్-పెర్ఫార్మెన్స్ తరువాత కరెక్షన్ దశ వస్తుంది. ఇవి రాబడులపై ప్రభావం చూపుతాయి. స్టాక్ మార్కెట్ పై అవగాహన పెంచుకోవడానికి, ఏ సమయంలో స్టాక్స్ కొనుగోలు చేయాలి? లేదా ఎప్పుడు నిష్క్రమించాలి? అనే విషయాలు తెలుసుకోవాలి. ఉదాహరణకు, 2019 నుండి 2023 వరకు, మార్కెట్లు సగటున 18% రాబడిని అందించాయి. అయితే, ఆ ఐదేళ్లలో ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు నెలలను మీరు మిస్ అయితే, మీ రాబడులు -5 శాతానికి పడిపోయేవి’’ అని ఎస్టీ అడ్వైజర్స్ ఇన్వెస్ట్మెంట్స్ హెడ్ వివేక్ శర్మ విశ్లేషించారు.