Travis Head Out: మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి టీమిండియాకు ఎంతో ముఖ్యమైన వికెట్ తీసిపెట్టాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్, వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో సెంచరీలతో ట్రోఫీలను దూరం చేసిన ట్రావిస్ హెడ్ ను ఈసారి తక్కువ స్కోరుకే ఔట్ చేశాడు. సెమీఫైనల్లోనూ మెల్లగా జూలు విదిల్చేలా కనిపించిన హెడ్.. మిస్టరీ స్పిన్నర్ మ్యాజిక్ ముందు నిలవలేకపోయాడు.