చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఆరోపణలకు ఆధారాలు చూయించాలని ఎమ్మెల్యే నాని భార్య సుధారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు చంద్రగిరి టవర్‌క్లాక్ వద్దకు మంగళవారం రావాలని ఆమె సవాల్ విసిరారు. ఈ నేపథ్యంలో పులివర్తి సుధ టవర్‌క్లాక్ వద్ద మీడియా సమావేశం నిర్వహించి చెవిరెడ్డిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు.