మంగళవారం సాయంత్రం 5:30 గంటల సమయంలో పూర్తి ఆపస్మారక స్థితిలో ఉన్న సింగర్ కల్పనను ఆసుపత్రికి తీసుకువచ్చారని డాక్టర్ చైతన్య తెలిపారు. నిద్ర మాత్రలు ఎక్కువ డోస్ తీసుకున్నారని, అందుకే అచేతస్థితి చేరాన్నారు. నిద్ర మాత్రల డోస్ ఎక్కువ అవ్వడంతో, ఆమె స్టమక్ వాష్ చేశామన్నారు. బ్రీతింగ్ సమస్యలకు పరీక్షలు చేశామని, ప్రస్తుతం పలమనరీ సమస్యకు చికిత్స అందించామని వైద్యులు తెలిపారు. అత్యవసర పరిస్థితిలో 12 గంటల పాటు వెంటిలేటర్ పెట్టామన్నారు.