తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావటంతో ప్రతిపక్ష బీఆర్ఎశ్ నేతలు ఆశలు పెంచుకుంటున్నారు. ఈసారి ఎలాగైనా పార్టీ నుంచి అవకాశం దక్కించుకోవాలని చూస్తున్నారు. సంఖ్యా బలం ప్రకారం ఒక్క సీటు దక్కే అవకాశమే ఉన్నప్పటికీ… పలువురు ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.