నటిగా సమంత(Samantha)దర్శకురాలిగా నందినిరెడ్డి(Nandini Reddy)ప్రేక్షకుల్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ని సంపాదించారు.ఈ ఇద్దరి కాంబోలో ఒక మూవీ తెరకెక్కబోతుందనే వార్తలు గత కొన్నిరోజుల నుంచి వినిపిస్తున్నాయి.’నందిని రెడ్డి’ పుట్టినరోజు సందర్భంగా సమంత సోషల్ మీడియా వేదికగా ‘నందిని తో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్నానట్టు  పోస్ట్ చేసింది.దీంతో ఆ ఇద్దరు కలిసి సినిమా చెయ్యబోతున్నారని, వేరే లాంగ్వేజ్ కి చెందిన ఒక మూవీకి రీమేక్ గా అది తెరకెక్కబోతుందనే ఊహాగానాలు మరింతగా ఎక్కువయ్యాయి.


ఇప్పుడు ఈ మొత్తం విషయంపై నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతు సమంత తో నా నెక్స్ట్ ప్రాజెక్ట్ అనేది ఒట్టి రూమర్.ఆ రూమర్ కి ఐదుమార్కులకి ఒక మార్కుఇస్తాను.ఈ సారి మంచి రూమర్ సృష్టించండి.ఒక వేళ సమంత తో సినిమా తెరకెక్కిస్తే  ఆ విషయాన్నీ ఎంతో ఆనందంగా,సగర్వంగా ప్రకటిస్తాను.నా నెక్స్ట్ సినిమా రీమేక్ కాదు.ఒరిజినల్ స్క్రిప్ట్ తో తెరకెక్కుతుందని  నందిని రెడ్డి వెల్లడి చేసింది.

నందిని రెడ్డి,సమంత కాంబోలో 2019 లో ‘ఓ బేబీ'(oh Baby)లాంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో కూడిన మూవీ వచ్చి మంచి విజయాన్ని నమోదు చెయ్యడమే కాకుండా సమంత కెరీర్ లో అత్యుత్తమ నటనని కనపర్చిన సినిమాగా కూడా ఓ బేబీ నిలిచిపోతుంది. 

 


LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here