మంత్రి లోకేశ్ ఆగ్రహం
“గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలి..ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిని కించపరిచేలా మాట్లాడే ముందు, జగన్ ఒకసారి ఆలోచించుకోవాలి. జగన్ అహంకారంతో, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కించపరిచే విధంగా మాట్లాడటం బాధాకరం. సొంత తల్లి, చెల్లి, కార్యకర్తలు తనను ఎందుకు విశ్వసించటం లేదో జగన్ ఒకసారి ఆలోచించాలి. రాష్ట్రంలో అటు సంక్షేమం, ఇటు అభివృద్ధి కార్యక్రమాలు బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రజల ఆకాంక్ష మేరకు పరిపాలన చేస్తున్నాం. జగన్ బెంగుళూరులో ఉంటారు. ఆయనకు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవాలు తెలియవు. గత ప్రభుత్వంలో 12 లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి దూరమయ్యారు. ఎందుకో ఆయనే సమాధానం చెప్పాలి. ఇవన్నీ చర్చిద్దాం, అసెంబ్లీకి రండి.” –మంత్రి లోకేశ్