బ్యాలెట్ పద్ధతిలోనూ బీజేపీదే విజయం
డబ్బుల సంచులకు దీటుగా ఓట్ల డబ్బాలు విజయం సాధించాయని బండి సంజయ్ అన్నారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు కొన్నాళ్లుగా ఈవీఎం ట్యాంపరింగ్ పై ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఇప్పుడు బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఎన్నికల్లోనూ బీజేపీ విజయం సాధించింది, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి బీజేపీని ఓడించాలని కుట్ర చేశాయని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కు కౌంట్‌డౌన్ మొదలైందని బండి సంజయ్ అన్నారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. ప్రజల చూపు బీజేపీ వైపు ఉందన్నారు. త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ విజయ దుందుబి మెగిస్తుందని జోస్యం చెప్పారు.