దగ్గుబాటికి అభినందనలు..
‘నాటి ఆచారాలు, ఆహారపు అలవాట్లు, వ్యవసాయం వంటి అంశాలను పుస్తకంలో పొందుపరిచారు. లోతుకు వెళ్లి, సాధించాలనే తపన ఉంటేనే పుస్తకం రాయడం సాధ్యం అవుతుంది. యుద్ధాలు, సామ్రాజ్యాల ఆవిర్భావం, మత పెద్దల పెత్తనాలు, ఖండాల విభజన, బానిస వ్యవస్థ, అభివృద్ది.. ఇలా ఏ విషయాన్ని వదిలిపెట్టకుండా ఈ పుస్తకంలో వెంకటేశ్వరావు ప్రస్తావించారు. భవిష్యత్తులో ఏం జరుగుతోందో కూడా ముందుగానే ఊహించి తెలిపారు. ఇలాంటి మంచి పుస్తకం రాసిన వెంకటేశ్వరావును అభినందిస్తున్నాను’ అని చంద్రబాబు వ్యాఖ్యానించారు..