సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu)కొరటాల శివ(Koratala Siva)కాంబోలో తెరకెక్కిన భరత్ అనే నేను చిత్రం ద్వారా తెలుగు తెరకి పరిచయమైన నార్త్ ఇండియన్ భామ కియారా అద్వానీ(Kiara Advani)ఆ తర్వాత రామ్ చరణ్(Ram Charan)తో కలిసి వినయ విధేయ రామ, గేమ్ చెంజర్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకి మరింత దగ్గరయ్యింది.హిందీలో కంటిన్యూగా సినిమాలు చేసుకుంటూ వచ్చే కియారా ఖాతాలో ఎన్నో హిట్ సినిమాలు కూడా ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ బిగ్ ప్రాజెక్ట్స్ లో ఒకటిగా తెరకెక్కుతున్న ‘డాన్ ౩’ లో హీరోయిన్ గా కియారా ని మేకర్స్ అనౌన్స్ చేసారు.
రీసెంట్ గా తాను తల్లిని కాబోతున్నానని కియారా సోషల్ మీడియా వేదికగా వెల్లడి చేసింది.దీంతో ‘డాన్ 3 నుంచి కియారా వైదొలిగిందనే వార్తలు బాలీవుడ్ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ప్రస్తుతం ‘టాక్సిక్’,’వార్ 2′ లాంటి బడా ప్రాజెక్టులు చేస్తుండటంతో త్వరగా ఆ చిత్రాల షూటింగ్ ని పూర్తి చేసి ప్రెగ్నెన్సీ దృష్ట్యా రెస్ట్ తీసుకోవాలని చూస్తుందని, అందుకే ఆమె తప్పుకుందని అంటున్నారు.
డాన్ 3 లో రణవీర్ సింగ్(Ranveersingh)హీరో కాగా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్(Sharukh Khan)నుంచి గతంలో వచ్చిన డాన్ 1 ,డాన్ 2 కి కొనసాగింపుగా డాన్ 3 (DOn 3)తెరెక్కుతుంది.దీంతో ఒక ప్రెస్టేజియస్ట్ ప్రాజెక్టు ఆమెకి మిస్ అయిందని చెప్పవచ్చు.కియారా 2023 లో ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్ధ్ మల్హోత్రా(Sidharth Malhotra)ని వివాహం చేసుకుంది