ఐడిబిఐ బ్యాంక్ ఉత్సవ్ కాలబుల్ ఎఫ్డి: ఐడిబిఐ బ్యాంక్ ఉత్సవ్ కాలబుల్ ఎఫ్డీ 300 రోజుల కాలపరిమితిపై సాధారణ పౌరులకు 7.05 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.55 శాతం వడ్డీని అందిస్తోంది. ఐడిబిఐ బ్యాంక్ అనేక ఇతర ప్రత్యేక కాలపరిమితి ఎఫ్‌డిలను కూడా అందిస్తుంది. 375 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ జనరల్, సీనియర్ సిటిజన్లకు వరుసగా 7.25 శాతం, 7.85 శాతం వడ్డీని అందిస్తోంది. 444 రోజుల ఎఫ్డీపై బ్యాంక్ జనరల్, సీనియర్ సిటిజన్లకు వరుసగా 7.35 శాతం, 7.85 శాతం వడ్డీని అందిస్తోంది. 555 రోజుల ఎఫ్డీపై సాధారణ పౌరులకు 7.40 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.9 శాతం వడ్డీ లభిస్తుంది. చివరగా, 700 రోజుల ఎఫ్‌డిపై, బ్యాంక్ 7.20 మరియు 7.70 శాతం వడ్డీని అందిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ ను ప్రారంభించడానికి చివరి తేదీ మార్చి 31, 2025.